Dhananjay: కన్నడ నటుడు, ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డాలీ ధనుంజయ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతని వివాహ నిశ్చితార్థం చిరకాల స్నేహితురాలు ధన్యతతో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ధనుంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మైసూర్ లో చదువుకుంటున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకూ వచ్చిందని తెలుస్తోంది. వీరి వివాహం వచ్చే యేడాది ఫిబ్రవరి 16న మైసూర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగబోతోంది. అదే రోజు రాత్రి వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. సత్యదేవ్ తో కలిసి తెలుగులో ధనుంజయ్ నటిస్తున్న ‘జీబ్రా’ మూవీ ఈ నెల 22న విడుదల కాబోతోంది.
View this post on Instagram