Dasoju sravan: మల్కాజిగిరిలో మైనంపల్లి రౌడీయిజం – దాసోజు శ్రవణ్ విమర్శలు

Dasoju sravan: కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మైనంపల్లి మరో గ్యాంగ్‌స్టర్ నయీంలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌లో నేరాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని, మల్కాజిగిరిలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై నిరాధారమైన కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజాప్రభుత్వమా? లేక రౌడీయిజానా? అని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

“మరలిపోయినట్లే మారతారని మైనంపల్లిని చూసి ఆశించాం. కానీ ఆయనలో ఎలాంటి మార్పు కనిపించదు” అని శ్రవణ్ వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన, మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు అశోభనీయమైనవని, ఆయన బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు చేసిన విమర్శలను ఖండిస్తున్నట్టు తెలిపారు.

“చీమలపుట్టలోకి పాము చొరబడినట్లు మైనంపల్లి మల్కాజిగిరిలోకి వచ్చి రౌడీయిజం చేస్తున్నారు. పోలీసులకు ఆయనపై ఫిర్యాదు చేయనున్నాం,” అని పేర్కొన్నారు. “ఒకప్పుడు కేటీఆర్‌కు అభిమానం చూపిస్తూ ఆయన పాదాల వద్దనూ ఉండిన మైనంపల్లి, ఇప్పుడు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం శోచనీయమైన విషయం,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *