Junior: గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి తన తొలి సినిమా జూనియర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి వస్తున్న అభిమానం, ప్రేమపై ఎక్స్‌లో స్పందించారు. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు నమస్కరిస్తూ, సినిమాను నిజాయితీతో తీశామని, అభిమానుల ఆదరణ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఈ సినిమా కోసం రాధాకృష్ణ దర్శకత్వంలో, శ్రీలీల, జెనీలియా వంటి తారలతో కలిసి ఎంతో కష్టపడ్డామని తెలిపారు.
Also Read: Most Popular Film Stars: భారత సినిమా స్టార్స్ టాప్ లిస్ట్! నెంబర్ 1 ఎవరు?
ప్రేక్షకుల ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ తమకు తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. జూనియర్లో కిరీటి నటన, డాన్స్‌లకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో విడుదలై, ప్రేక్షకులను అలరిస్తోంది. మంచి కంటెంట్‌తో మరిన్ని చిత్రాలు అందించేందుకు కిరీటి బృందం సన్నద్ధమవుతోంది. మరి జూనియర్ తో మెప్పించిన కిరీటి తన సినిమాలతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు.
‘జూనియర్’కు వస్తున్న ప్రేమ, ఆదరణను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది.
మేము ఎంతో నిజాయితీగా, హృదయపూర్వకంగా ఈ సినిమాను తీశాం.మీకు మంచి సినిమాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం.
మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని… pic.twitter.com/TFEqkUHd4M
— Kireeti (@KireetiOfficial) July 19, 2025
