ACB Raids: రాష్ట్రంలో అవినీతి జాఢ్యం రోజురోజుకూ మితిమీరుతున్నది. ఏసీబీ దూకుడుతో ఆ అవినీతి జాఢ్యం బట్టబయలవుతున్నది. ఐదు పదుల జీతాలు అందుకుంటూ కూడా అసహాయుల నుంచి అందినకాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్న అవినీతి ఉద్యోగులు.. జంకు లేకుండా దోచుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరకకుంటే దొర.. అన్న రీతిలో నొక్కేస్తున్నారు. ఏసీబీ దాడుల్లో గత రెండు రోజుల్లోనే నలుగురు అవినీతి చేపలు పట్టుబడటం ఆందోళన కలిగిస్తున్నది.
ACB Raids: సిద్దిపేట జిల్లా ములుగు మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ ఎలగందుల భవానీ రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసింది. బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు విచారణ జరిపి భవానీపై కేసు నమోదు చేశారు. అదే విధంగా మంచిర్యాల జిల్లా లేబర్ ఆఫీసర్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ACB Raids: ఓ వ్యక్తి బీమా సొమ్ము ఇచ్చేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సహాయ కార్మిక అధికారిణి పాక సుకన్య, ఆమె ప్రైవేటు సహాయకురాలు మోకినేపల్లి రాజేశ్వరిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధిత కుటుంబం నుంచి రూ.30,000 లంచం తీసుకున్న ఘటనను నిర్ధారించుకున్న ఏసీబీ అధికారులు వారిద్దరినీ అరెస్టు చేశారు.
ACB Raids: ఇలా అవినీతి జాఢ్యం రాష్ట్రమంతటా వేళ్లూనుకొని ఉన్నదని ఈ ఘటనలతో రుజువైంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో లంచం లేనిదే పనులు కావడం లేదని ఈ ఘటనలో నిదర్శనంగా నిలిచాయి. ఇటీవల కాలంలో ఏసీబీ దూకుడుగా దాడులు కొనసాగిస్తుండటంతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం లంచం తీసుకోవడాన్ని మరవకపోవడం గమనార్హం.