CM Chandrababu: నంద్యాల జిల్లా ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అల్లూరు గ్రామం వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి రాయలసీమకు జీవనాడి అయిన కృష్ణా జలాలను తరలించేందుకు ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చి మోటార్లను ఆన్ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని అందించడంలో హంద్రీనీవా ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. హంద్రీనీవా ఫేజ్-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ నీటి విడుదల ద్వారా నంద్యాల జిల్లాతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాలకు సాగునీరు అందుతుందని, ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Pulivendula 90 Cr Scam: 90 కోట్ల ల్యాండ్.. కడప డిప్యూటీ మేయర్ కబ్జా బాగోతం
ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యారు. కృష్ణా జలాలు తమ పొలాలకు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అంది, పంటల దిగుబడి పెరుగుతుందని, తద్వారా రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి, రాయలసీమలోని అన్ని ప్రాంతాలకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.