Manisha Koirala: బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాకు యూకేలోని బ్రాడ్ఫోర్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సినిమా రంగంలో ఆమె చేసిన కృషి, క్యాన్సర్‌తో పోరాటం, సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసిన మనీషా, తన జీవితంలో కష్టాలు, విజయాలు, సేవా దృక్పథం తనను ఎలా రూపొందించాయో వివరించారు. నేపాల్‌లోని ప్రభావవంతమైన కొయిరాలా కుటుంబంలో జన్మించిన మనీషా, సినిమాల్లోకి అడుగుపెట్టి బాంబే, దిల్ సే, హీరామండీ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.
క్యాన్సర్‌ను జయించిన ఆమె, ఆరోగ్యం, సామాజిక స్పృహపై అవగాహన కల్పిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచారు. తన తాతమ్మ సుశీలా కొయిరాలా నుంచి నేర్చుకున్న విలువలు, కళల పట్ల అభిరుచి తన విజయాలకు బాటలు వేశాయని మనీషా గుర్తు చేసుకున్నారు.