Vangalapudi Anitha: పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో ఈరోజు హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ప్రజల ఇళ్లకు వెళ్లి, NDA ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు గురించి వివరించారు. అనంతరం పాయకరావుపేటలో చేనేత సహకార సంఘంను పరిశీలించిన మంత్రి, చేనేత కార్మికుల సమస్యలపై దృష్టి సారించారు.
చేనేత కార్మికులకు చేయూత
జమదాని చీరలకు గుర్తింపు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాయకరావుపేట పట్టణంలో జమదాని చీరల నేసే సంప్రదాయం గర్వకారణమని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం పూర్తి స్థాయి సహాయం అందిస్తుందని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారం చూపిస్తామని చెప్పారు.
జగన్‌పై తీవ్ర విమర్శలు
అనంతరం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి వంగలపూడి అనిత, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
“జగన్ మానవత్వం ఉన్న మనిషిలా వ్యవహరించడం లేదు” అని అనిత ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు.“రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్‌ది” అని అనిత తీవ్రంగా విమర్శించారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: కులగణనపై రాహుల్ గాంధీ సంకల్పం ప్రభావం
రౌడీషీటర్లను, బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను మాత్రమే జగన్ పరామర్శిస్తున్నారని సెటైర్లు వేశారు.“జగన్ పర్యటనలో ఒకసారి తలకాయ, మరోసారి మామిడికాయలు తొక్కించారు… ప్రజలు కూడా ఆలోచించాలి” అని అన్నారు.
చట్టపరమైన చర్యలు
మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసహనీయమని హెచ్చరించారు.