Macherla Lo Marpu

Macherla Lo Marpu: జూలకంఠి బ్రహ్మా రెడ్డి రాజకీయం ఊహాతీతం..

Macherla Lo Marpu: రాష్ట్ర రాజకీయాల్లో పల్నాడు ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు ప్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రాయలసీమని పక్కకి నెట్టి ప్యాక్షన్‌లో మొదటి వరుసలో నిలిచింది పల్నాడు. పల్నాడు ప్రాంతానికి ఆ పేరు రావడానికి గల కారణం పల్నాడు ప్రాంతంలో భాగమైన మాచర్ల నియోజకవర్గంలో గత రెండు దశాబ్ధాలుగా జరిగిన హింసాత్మాక ఘటనలు, ఆ ఘటనలను పెంచిపోషించిన నాయకులు. వారే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి. వారి ప్యాక్షన్ తీవ్రత ఏ విధంగా ఉంటుందో.. గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సంఘటనలను దేశం మొత్తం చూసింది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన రామకృష్ణారెడ్డి వరుసగా నాలుగు సార్లు మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే… ప్రజాదరణ ఆ స్థాయిలో ఉందనుకోంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. హత్యా రాజకీయాలు, దాడుల సంసృతి ద్వారా అక్కడి ప్రజలు రెండోపార్టీ పేరు చెప్పాలంటేనే భయపడే విధంగా చేసి, గెలుస్తూ వచ్చారనమాట.

అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పిన్నెల్లి హత్యా రాజకీయాలు, దాడుల సంస్కృతితో విసుగు చెందిన మాచర్ల ప్రజలు, వ్యాపారులు ఆర్దికంగా బలహీనంగా ఉన్న జూలకంటి బ్రహ్మనందరెడ్డిని చందాలు వేసుకుని మరీ మాచర్ల ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో దాదాపు రెండు దశాద్దాల తరువాత మాచర్లలో మొదటిసారి టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మనందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే జూలకంటి ఎమ్మెల్యే అయిన తరువాత గత రెండు దశాబ్ధాలుగా హింస, ప్యాక్షన్ రాజకీయాలు చేసిన వారి భరతం పడతారు అనుకొన్నారు అందరూ. కానీ అందుకు భిన్నంగా అభివృద్ధికి మొహమాసిన మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు జూలకంటి. కేవలం సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో సుమారు 17 వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

Also Read: Mithun Reddy: ఢిల్లీ లిక్కర్ కేసు: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ!

Macherla Lo Marpu: పిన్నెల్లి హయాంలో హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన మాచర్ల నియోజకవర్గంలో కేవలం సంవత్సర కాలంలోనే జూలకంటి.. నాగార్జున సాగర్ నుండి మాచర్ల నియోజకవర్గం మొత్తం నీరు ఇవ్వాలనే లక్ష్యంతో జలశిరి పథకం కింద 800 కోట్లతో పనులు ప్రారంభించారు. 240 కోట్లతో అనేక హైవేల అభివృద్ధి పనులను స్టార్ట్ చేశారు. సుమారు 50 కోట్లతో పంచాయతీల పరిధిలో సీసీ రోడ్ల పనులను స్టార్ట్ చేశారు. పల్నాడు ప్రాంతానికే జీవధార లాగా భావించే వరికపుడిశల ప్రాజెక్ట్ కింద 340 కోట్లు మంజూరు చేయించారు. ఇలా నియోజకవర్గం మొత్తం కేవలం సంవత్సర కాలంలో 17 వందల కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత జూలకంటికే దక్కుతుంది.

అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా… జూలకంటి ఎమ్మెల్యే అయిన తరువాత మాచర్ల నియోజకవర్గ ప్రజలు, వ్యాపారులు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. కన్ను పడిన స్దలాన్ని కబ్జా చేయడం, హత్యా, దాడుల రాజకీయాలు, వ్యాపారస్తులు నెలనెల కట్టే కప్పం నుంచి తమకు విముక్తి లభించిందని ప్రజలు, వ్యాపారులు సంతోషంగా ఉన్నారు. చూడాలి మరి. కేవలం సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో ఇన్ని మార్పులు చేసిన… జూలకంటి రానున్న రోజుల్లో మాచర్ల నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు తెస్తారో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *