Jc Prabhakar: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర సందర్భంగా అనంతపురం జిల్లా పెద్ద పప్పూరులో జరిగిన సభలో బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి — “నీలాంటి పిల్ల నాయకులు ఎన్నోమంది వచ్చారు… పోయారు కూడా. నువ్వు మాట్లాడే భాష మేము కూడా మాట్లాడగలం. మేము మాట్లాడితే మాత్రం ప్రజలు అసహ్యం చెందుతారు,” అంటూ ఎద్దేవా చేశారు.
అంతేకాక, “రప్పా రప్పా కాదు… రాత్రిపూట ఒక్కసారి కన్ను ఎగరేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది,” అంటూ బైరెడ్డిని కఠినంగా హెచ్చరించారు. “పొగరు తగ్గించుకుని వ్యవహరించు. నీకు మంచి భవిష్యత్తు ఉంది, దాన్ని నువ్వే నాశనం చేసుకోకు” అని హితవు పలికారు.