Murder Case:

Murder Case: భార్య చేతిలో మ‌రో భ‌ర్త హ‌తం.. సినీ ఫ‌క్కీలో దారుణ‌హ‌త్య‌

Murder Case: భర్త‌ల హ‌త్య‌ల ప‌రంపర కొన‌సాగుతున్న‌ది. భార్య‌ల చేతిలో హ‌త‌మ‌వుతున్న ఘ‌ట‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. గ్వాలియ‌ర్‌, గ‌ద్వాల త‌దిత‌ర చోట్ల జ‌రిగిన దారుణాల‌ను స‌భ్య‌స‌మాజం ఇంకా మ‌రువ‌క ముందే తెలంగాణ‌లోని యాదాద్రి-భువ‌న‌గిరి జిల్లాలో మ‌రో దారుణం చోటుచేసుకున్న‌ది. సినీ ఫ‌క్కీలో త‌న భ‌ర్త‌ను అత‌ని భార్యే హ‌త్య చేయించింది.

Murder Case: యాదాద్రి-భువ‌న‌గిరి జిల్లా కాటేప‌ల్లి వ‌ద్ద బైక్‌పై వెళ్తున్న స్వామిని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో స్వామికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో స్థానికులు వెంట‌నే చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అత‌ను చికిత్స పొందుతూ ఆసుప‌త్రిలోనే ప్రాణాలిడిశాడు. బైక్‌ను వెనుక నుంచి కారు బ‌లంగా ఢీకొన‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని స్థానికులు తెలిపారు.

Murder Case: అయితే తొలుత ఈ ఘ‌ట‌న‌ను రోడ్డు ప్ర‌మాదంగా భావించి పోలీసులు విచారించారు. ఈ విచార‌ణ‌లో న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌కొచ్చాయి. స్వామి భార్యే కారును రెంట్‌కు తీసుకొని భ‌ర్త‌ను చంపించిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ దారుణ హ‌త్య‌లో స్వామి బావ‌మ‌రిది కూడా ఉన్న‌ట్టు తేలింది. దీంతో పోలీసులు స్వామి భార్య‌తో పాటు అత‌ని భావ‌మ‌రిది, సుపారి కిల్ల‌ర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bus Accident: హైద‌రాబాద్‌లో రెండు బ‌స్సులు ఢీకొని ఏఎస్పీ దుర్మ‌ర‌ణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *