Kcr

Kcr: కేసీఆర్ తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు.. కవిత గురించేనా..?

Kcr: హైదరాబాద్‌ నందినగర్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సోమవారం (జులై 14) భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు లోతుగా చర్చించనున్నట్లు సమాచారం.

ఈ భేటీకి ప్రధాన కారణం ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన వివాదం. మల్లన్న వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహంతో మల్లన్నకి చెందిన క్యూ న్యూస్‌ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక జాగృతి కార్యకర్త గాయపడినట్లు తెలిసింది.

కవిత – మల్లన్న వివాదం లో మలుపులు

సంగారెడ్డిలో ఇటీవల జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో మల్లన్న మాట్లాడుతూ – “బీసీలకు కవితకు సంబంధం ఏమిటి? బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆమె ఎందుకు సంబరాలు చేసుకుంటోంది?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కవిత తీవ్రంగా స్పందిస్తూ, మల్లన్నను ఖండించారు.

ఇది కూడా చదవండి: Crime News: ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం

దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరస్పరంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకోవడంతో, ఇద్దరిపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. కవిత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలుసుకొని – మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ కోరారు.

కేసీఆర్ స్పందనపై ఉత్కంఠ

ఇంత వరకూ ఈ వివాదంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులెవరూ ప్రజా వేదికపై స్పందించలేదు. తాజాగా నందినగర్‌లో జరిగిన భేటీతో – పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందా? కవితకు మద్దతుగా బీఆర్ఎస్ తీసుకునే దౌత్యం ఏమిటన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గాణ రాజకీయాలు ఇప్పటికే వేడి పుంపుతున్న వేళ, ఈ భేటీ ప్రాధాన్యత కలిగింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajasthan Popular Places: రాజస్థాన్ లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *