CM Revanth Reddy:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బోనం సమర్పించారు. సీఎంతోపాటు అమ్మవారిని మంత్రులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేంనరేందర్‌రెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

