Bengaluru Stampede: ఐపీఎల్ పోటీల్లో విజయం సాధించిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీం విజయోత్సవం సందర్భంగా బెంగళూరు చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నియమించిన జ్యుడీషియల్ కమిషన్ తన నివేదికను తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. ఈ తొక్కిసలాటకు కారకులు ఎవరనే విషయాన్ని ఆ కమిషన్ తేటతెల్లం చేసింది. బాధ్యులెవరనే విషయాన్ని వెల్లడించింది.
Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థ, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని తన నివేదికలో జ్యుడీషియల్ కమిషన్ తేల్చి చెప్పింది.
Bengaluru Stampede: రిటైర్డ్ జడ్జి జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలో ఏర్పాటైన ఈ జ్యుడీషియల్ కమిషన్ పలు విషయాలను, లోపాలను ఎత్తిచూపింది. ఈవెంట్ నిర్వహణలో కష్టమని వారికి ముందే తెలుసని, అయినా విధి నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం చూపారని కూడా వివరించింది. ఈ మేరకు తన నివేదికను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అందజేసింది. ఈ నివేదికను జూలై 17న రాష్ట్ర క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నది.
Bengaluru Stampede: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ క్రికెట్ జట్టు విజయెత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. సుమారు 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా, కర్ణాటక హైకోర్టు కూడా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నది. ఇప్పటికే ఆర్సీబీ జట్టు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నది.