China: పర్యావరణ పరిరక్షణ కోసం చైనా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అభివృద్ధి పేరిట పెద్ద పెద్ద డ్యామ్‌లు, జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించే రోజులు ఇక చైనాలో మిగలడం లేదు. ఎందుకంటే… ప్రకృతిని కాపాడటమే ఇప్పుడు వారి ప్రథమ కర్తవ్యం!
300 డ్యామ్‌లు కూల్చివేత… 342 విద్యుత్ కేంద్రాలకు తాళం!
చైనా ఇప్పటివరకు 300 డ్యామ్‌లను కూల్చివేసింది. అంతేకాదు, 373 హైడ్రోపవర్ స్టేషన్లలో 342 చిన్న జలవిద్యుత్ కేంద్రాలను మూసివేసింది. ఈ చర్యలు 2020లో మొదలయ్యాయి. ఒక చేప జాతిని, ఒక నదీ ప్రవాహాన్ని కాపాడేందుకు చేసిన ఈ నిర్ణయాలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నాయి.
యాంగ్జీ నది ప్రాధాన్యం
చైనాలోని యాంగ్జీ నది ఆసియాలో అతి పొడవైన నది. ఇది అక్కడి ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉంటుంది. గతంలో ఈ నదిపై ఎన్నో డ్యామ్‌లు నిర్మించారు. దీంతో చేపల జీవితం, జలచరాల ఆధారపడిన ప్రాంతాల ప్రకృతి తలకిందులయ్యింది. ముఖ్యంగా యాంగ్జీ ఉపనదిగా ఉన్న చిషుయ్ హే (రెడ్ రివర్) ప్రాదేశిక చేపల రక్షణకు కీలకం. కానీ ఆ నదిపై వచ్చిన డ్యామ్‌లు, విద్యుత్ కేంద్రాల కారణంగా నది ప్రవాహం ఆగిపోయింది. ఫలితంగా నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎండిపోయాయి.
ఇది కూడా చదవండి: Actress Humaira Asghar: చనిపోయింది 9 నెలల క్రితం.. శవాన్ని బయటికి తీసింది 15రోజుల ముందు.. మిస్టరీగా మరీనా నటి మృతి
యాంగ్జీ స్టర్జన్‌కు రెండో జీవితం!
స్టర్జన్ చేప (Yangtze Sturgeon) ఒక అరుదైన చేప జాతి. ఇది గతంలో యాంగ్జీ నదిలో విస్తృతంగా కనిపించేది. కానీ 1970 నుంచి దీనిని ఎక్కువగా పట్టడం, డ్యామ్‌లు నిర్మించడం వంటివి కారణంగా ఈ జాతి మాయమయ్యే స్థితికి చేరింది. చివరకు 2022లో ఈ చేపను ‘అంతరించిపోతున్న జాతి’గా ప్రకటించారు.
కానీ చైనా తీసుకున్న పర్యావరణ చర్యలతో ఇప్పుడు దానిలో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. 2023, 2024లో ఈ చేపల రెండుసార్లు నదిలోకి వదిలారు. శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారం అవి సజీవంగా కొనసాగుతున్నాయి, తిరిగి సంతతిని పెంచుతున్నాయి. ఇది పెద్ద విజయం అని పరిగణించవచ్చు.
పర్యావరణం కోసం అభివృద్ధిని వెనక్కి నెట్టి…
వృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం మనకు ఎప్పటికీ అనుకూలం కాదు. ఇది చైనా చాటిచెప్పింది. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన డ్యామ్‌లను తిరిగి కూల్చేస్తోంది. వన్యప్రాణుల రక్షణ, జీవవైవిధ్యం పరిరక్షణ కోసం చైనా తీసుకున్న ఈ చర్యలు, మిగతా దేశాలకు కూడా మంచి బోధనగా నిలుస్తున్నాయి.