Delhi: జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టోల్ ప్లాజాల్లో లూజ్ ఫాస్టాగ్‌లు వాడకాన్ని నిషేధించనుంది. వాహనదారులు తమ వాహనాల windshield పై అతికించకుండా, ఫాస్టాగ్‌ను పర్సు నుంచి తీసి చూపించే పద్ధతిని “లూజ్ ఫాస్టాగ్”గా నిర్వచిస్తున్నారు.
ఈ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద స్కానింగ్ సక్రమంగా జరగకపోవడంతో భారీగా రద్దీ ఏర్పడుతోంది. సమస్యను నివారించేందుకు అలాంటి ఫాస్టాగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని NHAI స్పష్టంచేసింది.
ఈ మేరకు టోల్ కలెక్షన్ ఏజెంట్లకు లూజ్ ఫాస్టాగ్‌ల సమాచారాన్ని ప్రత్యేకంగా రిపోర్ట్ చేయాలని సూచించింది. ఇలాంటివి గుర్తిస్తే సంబంధిత ఫాస్టాగ్‌ను బ్లాక్‌లిస్ట్ చేస్తారు.
ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఈమెయిల్ ఐడీని కూడా టోల్ ప్లాజా నిర్వాహకులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు.
వాహనదారులకు హెచ్చరిక: ఫాస్టాగ్ తప్పనిసరిగా వాహనంపై (windshield పై) అతికించాలి. లేదంటే అనవసరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.