Sri Vishnu: కామెడీలో తనదైన ముద్ర వేసిన శ్రీ విష్ణు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆయన నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ఈ హీరో ఇటీవల సింగిల్ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాక, ఆయన ఫాలోయింగ్ ను మరింత పెంచింది. ఇప్పుడు శ్రీ విష్ణు తన తదుపరి చిత్రం కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు. సామజవరగమనా సినిమాతో అభిమానులను అలరించిన దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరోసారి జత కడుతున్నాడు.
Also Read: Ramayana: రామాయణలో అమితాబ్ బచ్చన్
ఇటీవల రామ్ అబ్బరాజు చెప్పిన కథ శ్రీ విష్ణును ఆకట్టుకోవడంతో ప్రాజెక్ట్ కు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో రాబోతున్న సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. సామజవరగమనా తరహాలోనే ఈ చిత్రం కూడా కామెడీతో కూడిన వినోదాత్మక కథాంశంతో రానుందని సమాచారం. ఈ సినిమా వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


