Ramayana: ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. బాలీవుడ్ విజువల్ గ్రాండియర్ `రామాయణలో అమితాబ్ కూడా పార్ట్ కాబోతున్నారనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది. రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ లాంటి యంగ్ స్టర్స్ అందరూ కనిపిస్తున్నారు. మరి అమితాబ్ ఏ క్యారెక్టర్ చేస్తున్నారబ్బా అని ఎంక్వయిరీ చేస్తే.. ఇందులో బిగ్ బి కనిపించరు కానీ వినిపిస్తారట..
Also Read: The Paradise: ది ప్యారడైజ్ నుండి క్రేజీ అప్ డేట్..
అవును, రామాయణలో అమితాబ్ నటించడం లేదు కానీ జటాయువు క్యారెకర్ట్ కి హిందీలో డబ్బింగ్ చెప్పబోతున్నారట. మహాభారతం ఆధారంగా వచ్చిన కల్కిలో అశ్వత్థామగా కనిపించి, ఇప్పుడు రామాయణలో జటాయువుగా వాయిస్ వినిపించనున్నారు అమితాబ్.. అయితే దీని గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దివాళికి రానుంది..