Nayanatara: చంద్రముఖి మూవీ ఆడియో, వీడియో హక్కులు తమ వద్దే ఉన్నాయని, యూట్యూబ్ నుంచి సేకరించిన క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో చట్టవిరుద్ధంగా ఉపయోగించారని ఏపీ ఇంటర్నేషనల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించింది. ఈ విషయంలో లీగల్ నోటీసు పంపగా.. ఆ తర్వాతే నిర్మాతలు తమను లైసెన్స్ కోసం సంప్రదించారని సంస్థ చెప్పుకొచ్చింది.. తమ సినిమా దృశ్యాలను డాక్యుమెంటరీ నుంచి తక్షణమే తొలగించాలని.. లేకపోతే 5 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా చూడాలని సంస్థ కోర్టును కోరింది. ఇదిలా ఉండగా.. నయన్ డాక్యుమెంటరీ గత ఏడాది నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అప్పుడు హీరో, నిర్మాత ధనుష్ కూడా లీగల్ నోటీసులు పంపారు. నానుమ్ రౌడీ దాన్’ మూవీకి నిర్మాత అయిన ధనుష్.. ఈ మూవీ ఫుటేజీని తన అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ నయన తారపై 10కోట్ల దావా వేశారు.
దీని గురించి నయన్ ఎలా రెస్పాండ్ అవుతుందోనని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వారు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.