NK Lohith: ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఎన్.కె. లోహిత్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తాజాగా తెలుగు, తమిళ భాషలలో విడుదలకు సిద్ధమైన “జన నాయకుడు” చిత్రంపై భగవంతుని ఆశీస్సులు కోరుతూ ఆయన ఈ దర్శనాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ,
“త్వరలో విడుదల కాబోతున్న జన నాయకుడు చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమాకు విజయం కష్టపడిన ప్రతి ఒక్కరి సాధనను వెలుగులోకి తీసుకువస్తుంది. ఆ దేవుని ఆశీస్సులతో ఈ చిత్రం సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాను” అని అన్నారు.
అలాగే, “ఇది కేవలం మొదటిది మాత్రమే. త్వరలోనే మరొక భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించబోతున్నాం. ఇది ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ఒరవడి సృష్టించేలా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాం” అని వెల్లడించారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్ ఇప్పటికే దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్నది. తాజా ప్రాజెక్టులతో పాటు రాబోయే సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో వెలువడనున్న ప్రకటనకు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

