Crime News:

Crime News: నాకు ద‌క్క‌నిది మ‌రొక‌రికి ద‌క్క‌నివ్వ‌ను.. యువ‌తి హ‌త్యచేసింది ప్రియుడేన‌ని తేల్చిన పోలీసులు

Crime News: సంగారెడ్డి జిల్లా యువ‌తి హ‌త్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ యువ‌తిని చంపింది ఆమె ప్రియుడేన‌ని నిర్ధారించారు. త‌న‌కు ద‌క్కని అమ్మాయిని ఇంకొక‌నికి ద‌క్క‌నివ్వ‌న‌నే ఆ యువ‌కుడు ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు. సోమ‌వారం (జూలై 7న‌) జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై తాజాగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు త‌రలించారు.

Crime News: మెద‌క్ జిల్లా వెల్దుర్తి మండ‌లం మానేప‌ల్లికి చెందిన ప్ర‌వీణ్ కుమార్ (25) అనే యువ‌కుడు సంగారెడ్డి జిల్లా బండ్ల‌గూడ‌లో నివ‌సించే ర‌మ్య (23) అనే యువ‌తి ప్రేమించుకున్నారు. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ఆరు నెల‌ల క్రితం వీరిద్ద‌రి వివాహానికి యువ‌తి త‌ల్లిదండ్రులు నిరాకరించారు.

Crime News: ఆ త‌ర్వాత కొంత‌కాలం ఇద్ద‌రూ ఎవ‌రి దారిన వారున్నారు. ఇటీవ‌ల గ‌త వారం రోజులుగా ర‌మ్య స్పందించ‌డం లేద‌ని ప్ర‌వీణ్‌కుమార్ క‌సి పెంచుకోసాగాడు. ఏకంగా సోమ‌వారం ర‌మ్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడ‌వ‌ప‌డ్డాడు. ఈ స‌మ‌యంలో త‌న వెంట తీసుకెళ్లిన క‌త్తితో ఆమె గొంతుకోసి హ‌త్య చేశాడు.

Crime News: హ‌త్య కేసులో నిందితుడు ప్ర‌వీణ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. త‌న‌కు ద‌క్క‌ని అమ్మాయి ఇంకొక‌రికి ద‌క్కొద్ద‌నే ఉద్దేశంతోనే తాను ర‌మ్య‌ను హ‌త్య చేసిన‌ట్టు ఒప్పుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతున్నా.. స‌మాజం పాఠం నేర్చుకోవ‌డం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *