Asteroid 2025 NJ: భూమి సమీపానికి వచ్చి దూసుకెళ్లిన ఆస్టరాయిడ్ ముప్పు మళ్లీ పొంచి ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫుట్‌బాల్ మైదానం పరిమాణంలో ఉన్న 2025 ఎన్‌జే గ్రహశకలం సోమవారం మధ్యాహ్నం (జూలై 7) 3.16 గంటలకు భూమి కక్ష్యకు చాలా సమీపంలోకి వచ్చి దూసుకెళ్లింది. ఢీకొట్టే ప్రమాదం లేకపోయినా, దీని పరిమాణం వల్ల నాసా దీన్ని ప్రమాదకర శ్రేణిలో చేర్చింది.
Asteroid 2025 NJ: 2025 ఎన్‌జే గ్రహశకలం 85 అడుగుల వెడల్పుతో గంటకు 48,800 కిలోమీటర్ల వేగంతో ఇది భూమి కక్ష్యకు 22.4 లక్షల కిలోమీటర్ల దూరంలోకి వచ్చి వెళ్లింది. ఇదే గ్రహశకలం 2028వ సంవత్సరంలో మళ్లీ భూమికి సమీపంలోకి రానుందని హెచ్చరిస్తున్నారు. దీంతో అప్పటికీ ముప్పేనని తేల్చి చెప్తున్నారు. ఒకవేళ భూమికి ఆ గ్రహశకలం తాకితే పెద్ద ఎత్తున ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు.