Nagarjuna

Nagarjuna: తమిళ హిట్ రీమేక్‌లో నటించనున్న నాగార్జున?

Nagarjuna: ప్రముఖ నటుడు నాగార్జున మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ఆయోతి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ చిత్రం హృదయాన్ని హత్తుకునే కథాంశంతో పాటు బలమైన సామాజిక సందేశాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ రీమేక్ హక్కుల కోసం ఆయోతి ఒరిజినల్ నిర్మాణ సంస్థ అయిన ట్రిడెంట్ ఆర్ట్స్‌తో నాగార్జున బృందం చర్చలు జరుపుతోంది.

Also Read: Killer: సూర్య కిల్లర్ తో థ్రిల్ చేయనున్న రెహమాన్!

ఈ ప్రాజెక్టులో నాగార్జున కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది.అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రీమేక్ కచ్చితంగా ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *