BRICS

BRICS: భారత్​కు బ్రిక్స్ మద్దతు.. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం

BRICS: ప్రపంచంలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, శాంతి, భద్రత వ్యవస్థల్లో మార్పులు తప్పనిసరిగా అవసరమని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా పేర్కొన్నాయి. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత్‌, బ్రెజిల్‌ దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమ ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరాన్ని గట్టిగా ఆవిష్కరించాయి. ఈ విషయంపై చైనా, రష్యా దేశాలు కూడా పూర్తి మద్దతు ప్రకటించాయి.

ఈ సందర్భంగా బ్రిక్స్ ఉమ్మడి ప్రకటనలో భద్రతా మండలి మరింత ప్రజాస్వామ్యవంతంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేశాయి.

భారత్‌కి శాశ్వత సభ్యత్వానికి మద్దతు
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి చైనా స్వయంగా భారత్‌కు మద్దతు తెలిపిన ఘటన విశేషంగా మారింది. ఇది భారత్‌కి కీలక విజయంగా మారనుంది. ఇప్పటికే ఎన్నో దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయి. బ్రిక్స్‌లో భారత్‌కి శాశ్వత స్థానం రావాలని దేశాలన్నీ ఏకమై కోరడం విశేషం.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన
ప్రపంచ వాణిజ్యంలో ఏకపక్ష ఆంక్షలు, అధిక టారిఫ్‌లు, రక్షణ చర్యలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. WTO కేంద్రంగా ఉన్న పారదర్శక, న్యాయబద్ధ వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయాలని తీర్మానించాయి. అలాగే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించని ఆర్థిక ఆంక్షలు మానవహక్కులకు హాని కలిగిస్తున్నాయని హెచ్చరించాయి. ఈ ఆంక్షలు పేద దేశాల్లో ప్రజల జీవన స్థితిగతులను దెబ్బతీస్తున్నాయని వివరించాయి.

Also Read: Shubman Gill: వాళ్లు పేరు మరిచిపోయారు.. మ్యాచ్ ను గెలిపించి హీరో అయ్యాడు!

మోదీ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘21వ శతాబ్దపు సాఫ్ట్‌వేర్‌ను 20వ శతాబ్దపు టైప్‌రైటర్‌తో నడపలేం’’ అంటూ ప్రపంచ సంస్థల్లో మార్పుల అవసరాన్ని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ప్రతివారం టెక్నాలజీ మారుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, WTO వంటి సంస్థలు ఇప్పటికీ 80 ఏళ్ల క్రితం ఉన్న విధానాలను అనుసరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇవి ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చులు పెరుగుతుండటం, విభజన ధోరణి పెరగడంపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన నిధులు తగ్గిపోవడంతో వారి అభివృద్ధికి ఆటంకాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత కోసం రాజకీయ, శాస్త్రీయ పరిష్కారాలే మార్గమని స్పష్టం చేశాయి.

ALSO READ  BLA Attack on PAK Army: భారత దాడిలో ఉగ్రవాదులు మృతి.. బలూచ్ దాడిలో 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతి

భారత్‌కు ట్రినిడాడ్ అండ్ టొబాగో మద్దతు
భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి ట్రినిడాడ్ అండ్ టొబాగో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 2028–29కి గాను నాన్‌ పర్మనెంట్ మెంబర్‌షిప్‌ కోసం కూడా మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. అదే విధంగా, భారత్‌ కూడా ట్రినిడాడ్‌కు 2027–28కు గాను భద్రతా మండలిలో నాన్‌ పర్మనెంట్ మెంబర్‌షిప్‌కు మద్దతు ప్రకటించింది.

Also Read: Mobile Recharge: మొబైల్‌ రీఛార్జీలపై మళ్లీ భారం.. 10-12శాతం పెరిగే అవకాశం..!

ట్రినిడాడ్‌లో కీలక ఒప్పందాలు: 
ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షురాలు, ప్రధాని కమ్లా పెర్సాద్‌తో సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించారు. రెండు దేశాలు భద్రతా మండలి విస్తరణకు మద్దతు తెలిపాయి. ఆర్థిక, రక్షణ, వ్యవసాయం, ఆరోగ్య, డిజిటల్ పేమెంట్స్, విద్య వంటి రంగాల్లో సహకారం పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సంస్కృతి, క్రీడలు, దౌత్య శిక్షణ వంటి రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

ట్రినిడాడ్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ అర్జెంటీనాకు చేరుకున్నారు. బ్యూనస్ ఎయిర్స్‌లో ఘన స్వాగతం అందుకున్నారు. ప్రవాస భారతీయులు ‘మోదీ మోదీ’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో అతిధేయత చూపించారు. 57 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు భారత ప్రధాని పర్యటించడం విశేషం.

ట్రినిడాడ్ మహిళా క్రికెటర్లకు భారత్‌లో ప్రత్యేక శిక్షణ అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ట్రినిడాడ్ అభివృద్ధిలో భారత సంతతివారు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భారత సంతతివారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు అందజేస్తామని ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *