Konda Surekha:

Konda Surekha: మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో కొండా దంప‌తుల భేటీ

Konda Surekha: వ‌రుస‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచిన రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ‌, మాజీ ఎమ్మ‌ల్సీ కొండా ముర‌ళి దంప‌తులు తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో భేటీ అయ్యారు. ఇటీవ‌ల కొండా ముర‌ళి చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌తో వ‌రంగ‌ల్ జిల్లా ఎమ్మెల్యేల‌తో వారి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ది. ఇప్ప‌టికే కాంగ్రెస్ రాష్ట్ర,కేంద్ర అధిష్టానాల‌కు కొండా దంప‌తులపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేశారు.

Konda Surekha: వ‌రంగ‌ల్ జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదు మేర‌కు ఇప్ప‌టికే టీపీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్, క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీ స‌భ్యుల‌ ఎదుట కొండా ముర‌ళి హాజ‌ర‌య్యారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. వివ‌ర‌ణ‌తో కూడిన‌ సుధీర్ఘ లేఖ‌ను సైతం అంద‌జేశారు. ఆ త‌ర్వాత కూడా కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దానిపైనా వివ‌ర‌ణ ఇవ్వాలంటూ పార్టీ రాష్ట్ర క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం మ‌రో నోటీసును జారీ చేసింది.

Konda Surekha: ఈ నేప‌థ్యంలో కొండా దంప‌తులు మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్నది. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యేల‌తో ఉన్న వివాదాన్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ సంద‌ర్భంగా కొండా ముర‌ళి కూడా మాట్లాడారు. ప‌లు విష‌యాల‌ను మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో తాము చ‌ర్చించామ‌ని తెలిపారు.

Konda Surekha: తాను ఒక‌రి గురించి కామెంట్ చేయ‌న‌ని, త‌న‌కు ప్ర‌జాబ‌లం ఉన్న‌ద‌ని మీనాక్షి న‌ట‌రాజ‌న్‌తో తాను చెప్పాన‌ని కొండా ముర‌ళి తెలిపారు. చాలా కేసుల‌కే తాను భ‌య‌ప‌డ‌లేద‌ని, త‌న‌కు భ‌యం అనేదే లేద‌ని, ముందు నుంచి తాను చెప్తూనే ఉన్నాన‌ని కొండా ముర‌ళి తెలిపారు. పార్టీ ఎద‌గాల‌ని, సుధీర్ఘ‌కాలం పాల‌న సాగించాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు ముర‌ళి తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *