Royal Train: బ్రిటన్ రాజకుటుంబంతో 150 సంవత్సరాలకు పైగా అనుబంధం ఉన్న ‘ది రాయల్ ట్రైన్’ త్వరలో తన ప్రయాణాలు ఆపేయనుంది. క్వీన్ విక్టోరియా కాలం (1869) నుంచి నడుస్తున్న ఈ విలాసవంతమైన రైలును ఇప్పుడు ఆపివేయాలని బ్రిటన్ రాజు ఛార్లెస్-3 నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం, రైలు నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువగా ఉండటం. అలాగే, ఆధునిక రైల్వే వ్యవస్థలకు తగ్గట్టుగా దీనిని మార్చాలంటే ఇంకా ఎక్కువ ఖర్చవుతుందని బకింగ్‌హాం ప్యాలెస్ తెలిపింది. ఈ రైలులో మొత్తం 9 బోగీలు ఉంటాయి. 2027 వరకు దీని నిర్వహణ ఒప్పందం ఉన్నప్పటికీ, దానికంటే ముందే సేవలు ఆగిపోతాయి. రాజకుటుంబం ఖర్చులను తగ్గించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read: RCB: ఆర్‌సీబీకి షాక్: విజయోత్సవ వేడుకల తొక్కిసలాటపై బీసీసీఐ నోటీసులు!
దుబాయ్: పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించడానికి గల్ఫ్ దేశాలు ఒక కీలకమైన అడుగు వేశాయి. యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) త్వరలో ‘జీసీసీ టూరిజం వీసా’ను ప్రారంభించనుంది. ఈ కొత్త వీసా విధానం వల్ల పర్యాటకులు కేవలం ఒక్క దరఖాస్తుతో గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లోని ఆరు దేశాలను సందర్శించవచ్చు. అవి: సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్. యూరప్‌లోని షెంగెన్ వీసా మాదిరిగానే పనిచేసే ఈ విధానం పర్యాటకులకు ప్రయాణాన్ని చాలా సులభతరం చేస్తుంది. ఇది గల్ఫ్ దేశాలకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి, వారి ఆర్థిక వ్యవస్థలకు కూడా బలం చేకూర్చుతుందని భావిస్తున్నారు.
