Election Commission: రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అయిన కొండా సురేఖను ఎమ్మెల్యే అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఎమ్మెల్యే ఎన్నికల కోసం తాము రూ.70 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Election Commission:ఒక అభ్యర్థి ఎన్నికల్లో రూ.40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలని ఎన్నికల నిబంధనలు ఉన్నాయని, రూ.70 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నందున ఆయన భార్య ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ భరత్‌కుమార్, నాయకులు చిరుమల్ల రాకేశ్, నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు.