Gudivada Amarnath: వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. వైఎస్సార్‌సీపీ పాలనలో సోషల్ మీడియాలో అందరికంటే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది ఆయనే. అభివృద్ధిపై ప్రశ్నించిన విలేకరులకు చిత్ర విచిత్రమైన థియరీ చెప్పి… “గుడ్డు మంత్రి”గా పేరు తెచ్చుకున్నారు. ఐటీ మంత్రిగా దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తే… అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని బదులిచ్చారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమల గురించి అసెంబ్లీలో గొప్పగా చెబుతూ… అరిసెలు, బొబ్బట్లు, సున్నుండలు, అప్పడాల పరిశ్రమలు భారీగా తీసుకొచ్చామని చెప్పి నవ్వులపాలయ్యారు. ఈ తరహా వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నిత్యం ట్రోలింగ్‌కు గురయ్యారు గుడివాడ అమర్నాథ్. గతంలో నారా లోకేష్ తన యువ గళం పాదయాత్ర ముగింపు సభలో అమర్నాథ్‌ను “గుడ్డు మంత్రి” అంటూ హేళన చేశారు. దాన్ని మనసులో పెట్టుకున్న అమర్నాథ్ ఇన్నాళ్లకు ఓ కొత్త వాదన వినిపిస్తున్నారు.
తనని గుడ్డు మంత్రి అన్న లోకేష్‌పై తాజాగా గుడివాడ అమర్నాథ్ ఎదురుదాడికి దిగారు. లోకేష్‌ను ఇకపై “శోభనం లోకేష్” అంటూ పిలుస్తానని ప్రకటించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తానని, లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని లోకేష్ చేసిన ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. “మాట నిలబెట్టుకోలేని లోకేష్‌ను ఇకపై శోభనం లోకేష్‌గానే పిలుస్తా” అంటూ అమర్నాథ్ అక్కసు వెల్లబోసుకున్నారు. అసలు ఈ శోభనం లోకేష్ అన్న మాట ఎక్కడ నుండి పట్టుకొచ్చారా అని వెతికితే.. అమర్నాథ్ వాదనలో డొల్లతనం అంతా బయటపడుతోంది. ఏపీకి లోకేష్ ఏ పరిశ్రమలు తీసుకొచ్చారని ప్రశ్నిస్తే… ఎక్కడో, ఎవరో టీడీపీకి సంబంధించిన ఓ వ్యక్తి.. పెళ్లి అయ్యాక శోభనం రోజే పిల్లలు పుడతారా? అంటూ సమాధానం ఇచ్చారట. దానిని పట్టుకుని.. లోకేషే ఆ మాటలు అన్నట్లుగా… లోకేషేకి ఆపాదించాలని ప్రయత్నించారు గుడివాడ అమర్నాథ్.
Also Read: Singaiah Death Mystery: సింగయ్య కేసులో డ్రోన్ విజువల్స్ దాచిపెట్టారా?
Gudivada Amarnath: అయితే, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ పనితీరుకు మంచి పేరు వస్తోంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా రాష్ట్రానికి వస్తున్నాయి. అప్పటి ఐటీ మంత్రితో పోల్చుకుంటే.. ఇప్పటి ఐటీ మంత్రి గ్రాఫ్ ఎక్కడో ఉంది. అప్పడాలు, బొబ్బట్ల కంపెనీలు తీసుకొచ్చిన అమర్నాథ్ కనీసం లోకేష్‌ని టచ్ చేయలేని విధంగా ఇప్పుడు పరిస్థితులున్నాయి. వాస్తవాలు అంగీకరించకుండా… గుడివాడ అమర్నాథ్ చేసిన “శోభనం లోకేష్” వ్యాఖ్యలు ఆయనకే ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఇప్పటికే విపరీతంగా ట్రోలింగ్‌కు గురైన అమర్నాథ్‌కు ఈ వ్యాఖ్యలు మరింత నష్టం చేయవచ్చు అంటున్నారు పరిశీలకులు.


