Industrial Accident: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య 46కి చేరింది. సంఘటనా స్థలంలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో ఇంకా నలుగురు కార్మికుల ఆచూకీ గల్లంతైంది. ఆసుపత్రుల్లో 35 మందికి చికిత్స కొనసాగుతోంది. వర్షం కారణంగా రాత్రి నుంచి సహాయక చర్యలు నిలిచిపోయాయి. ఇప్పటికే 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. బాధితుల కుటుంబాలకు మృతదేహాలను అధికారులు అప్పగించారు.

