Koratala Siva: టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్స్‌తో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ కెరీర్‌లో ఒడిదొడుకులు తప్పడం లేదు. కేవలం నాలుగు చిత్రాలతోనే అగ్ర దర్శకుల సరసన చేరిన శివకి, ‘ఆచార్య’ డిజాస్టర్‌తో కెరీర్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిరంజీవి, రామ్‌చరణ్‌లతో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ ఒక్క పరాజయంతో శివతో సినిమా చేసేందుకు హీరోలు వెనకడుగు వేశారు. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమాతో కొరటాల మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
Also Read: Thammudu: “తమ్ముడు” గ్రాండ్ రిలీజ్‌కు అంతా సిద్ధం!
Koratala Siva: ఈ చిత్రం సూపర్‌హిట్‌తో పాటు భారీ కలెక్షన్లను రాబట్టింది. కానీ, ఇప్పుడు మళ్లీ శివకు హీరోల కొరత ఏర్పడింది. స్టార్ హీరోలు మరో రెండేళ్ల వరకు బిజీగా ఉండగా, నాని, విజయ్ దేవరకొండ వంటి వారి లైనప్‌లు కూడా నిండిపోయాయి. చిన్న హీరోలతో చేయడానికి శివ సుముఖంగా లేడు. ప్రస్తుతం ‘దేవర 2’ మాత్రమే చేతిలో ఉంది, కానీ దాని షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. శివ మళ్లీ అద్భుతాలు ఎప్పుడు సృష్టిస్తాడు? ఆయనకు మళ్ళీ ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి!