Thammudu

Thammudu: “తమ్ముడు” గ్రాండ్ రిలీజ్‌కు అంతా సిద్ధం!

Thammudu: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న చిత్రం “తమ్ముడు”. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన రిలీజ్ ట్రైలర్ లాంఛ్‌లో చిత్ర బృందం సందడి చేసింది. డీవోపీ కేవీ గుహన్ మాట్లాడుతూ, ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి, దర్శకుడు శ్రీరామ్ వేణు నావెల్టీ కథనంతో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు.

Also Read: Vishwambhara: చిరుతో మౌని రాయ్ స్టెప్స్? ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!

Thammudu: సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్, జై బగళాముఖీ పాటతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ జోడించామన్నారు. నటి లయ, తన క్యారెక్టర్ భిన్నంగా ఉంటుందని, రెండేళ్ల కష్టం ఫలిస్తుందని చెప్పారు. నితిన్, ఈ చిత్రం తన కెరీర్‌లో కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని, అభిమానులకు ఆనందాన్ని అందిస్తుందని అన్నారు. దిల్ రాజు, శ్రీరామ్ వేణు విజన్‌కు టెక్నీషియన్స్ అద్భుత సహకారం అందించారని, సినిమా ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ajith Kumar: అజిత్ కుమార్ - కార్తీక్ సుబ్బరాజ్ కాంబోలో భారీ ప్రాజెక్ట్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *