BJP New President: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఎంపికయ్యారు. ఆయన ABVPలో కూడా కీలకంగా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ ప్రకటనను బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్ మన్నెగూడలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు పాల్గొని రామచందర్ రావును అభినందించారు.
పార్టీ అభివృద్ధికి, బీజేపీను రాష్ట్రంలో మరింత బలంగా నిలబెట్టేందుకు కొత్త అధ్యక్షుడి నాయకత్వం ఉపయోగపడుతుందన్న నమ్మకం వ్యక్తమైంది.
ఏపీ బీజేపీకి కొత్త నేత మాధవ్
ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కూడా నూతన అధ్యక్షుడు ఎంపికయ్యారు. మాజీ ఎమ్మెల్సీ పెర్ల మాధవ్ ఈ పదవికి ఎంపికయ్యారు. ఆయన గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మాధవ్‌కు RSS మరియు బీజేవైఎంలో విశేష అనుభవం ఉంది. ఈ మార్పులతో రెండు రాష్ట్రాల్లో పార్టీకి కొత్త ఉత్సాహం, జోష్ రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

