Beerla ailaiah: బీజేపీలో రాంచందర్ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం తో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య దోస్తీ మరింత స్పష్టమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ నేత బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని ఆరోపించారు.
“రాంచందర్ రావు ఎన్నికతో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి మార్గం సుగమమైంది. బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేసే నేతకే బీజేపీ రాష్ట్ర పదవి దక్కింది. ఇది కేసీఆర్ ఎత్తుగడలే ఫలించాయన్న స్పష్టమైన సంకేతం,” అని ఆయన అన్నారు.
బీసీలకు బీజేపీలో న్యాయం జరుగటం లేదని విమర్శించిన ఐలయ్య, “బీసీలను పక్కన పెట్టే వ్యవస్థ బీజేపీలో ఉంది. దానికే నిరసనగా రాజాసింగ్ రాజీనామా చేశారు” అని పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్, బీజేపీల విలీనం ఖాయమని తన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు ఈ రాజకీయ కుట్రలను గుర్తించి సమయానికి తగిన బుద్ధి చెప్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

