Kiran Abbavaram

Kiran Abbavaram: ‘కే ర్యాంప్’తో కిరణ్ అబ్బవరం రీఎంట్రీ!

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. అయితే, ‘దిల్ రుబా’ నిరాశపరిచినా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నాడు. కొత్త దర్శకుడు జైన్స్ నానితో కలిసి తన 11వ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో మలయాళ నటి యుక్తి తరేజా టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. ‘K RAMP’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం హాస్య మూవీస్ బ్యానర్‌పై నిర్మాత రాజేష్ దండా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Also Read: Mrunal Thakur: మృణాల్ ఖాతాలో క్రేజీ లైనప్.. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో సందడి!

ఈ చిత్రం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటూ దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన కిరణ్ అబ్బవరం ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. లుంగీలో స్టైలిష్ లుక్, బీర్ సీసాలతో లవ్ సింబల్ బ్యాక్‌గ్రౌండ్‌తో కిరణ్ కనిపించాడు. ఈ సినిమాతో కిరణ్ మరోసారి సంచలన విజయం సాధిస్తాడని టీమ్ ధీమాగా ఉంది. ఈ చిత్రం కిరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Naga Chaitanya: 'తండేల్' చేయడం నా అదృష్టం: నాగచైతన్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *