Bhagyashri Borse

Bhagyashri Borse: తీవ్రంగా శ్రమిస్తున్న భాగ్యశ్రీ?

Bhagyashri Borse: అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైనప్పటికీ, కొన్ని కారణాలతో ఆమె ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో యువ నటి భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా చేరింది. భాగ్యశ్రీ ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె రామ్ సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’, దుల్కర్ సల్మాన్‌తో ‘కాంతా’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ మూడు చిత్రాల షూటింగ్ కోసం ఆమె సెట్ నుంచి సెట్‌కు పరుగులు పెడుతోందట. ‘లెనిన్’లో భాగ్యశ్రీ పాత్ర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. అఖిల్-భాగ్యశ్రీ జోడీ.. ఈ గ్రామీణ డ్రామాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *