Siddharth: సిద్దార్థ్ మరోసారి తన కొత్త చిత్రం ‘3 బిహెచ్కె’తో జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమయ్యాడు. ఇటీవల జరిగిన ‘3 బిహెచ్కె’ ప్రమోషన్ ఈవెంట్లో మీడియా ప్రశ్నలకు సమాధానిస్తూ, “నేను ఎవరి కోసం డబ్బు సంపాదించడానికి సినిమాలు చేయడం లేదు” అని వ్యాఖ్యానించాడు. ఈ మాటలు సినిమా విజయంలో నిర్మాతల లాభం కీలకమన్న వాస్తవాన్ని విస్మరించినట్లు విమర్శలు వచ్చాయి. నటనకు ప్రశంసలు దక్కినా, బాక్సాఫీస్ వసూళ్లు లేకపోతే నిర్మాతలు నష్టపోతారన్న లాజిక్‌ను సిద్దు పట్టించుకోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అలాగే, తన సినిమాను ‘చిన్న సినిమా’గా పిలవడంపై సిద్దార్థ్ తీవ్రంగా స్పందించాడు. “సినిమాలో కంటెంట్ ముఖ్యం, బడ్జెట్ కాదు” అని చెప్పిన అతను, పెద్ద చిత్రాలతో పోల్చడం సరికాదన్నాడు. ఈ వివాదం సిద్దార్థ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
