BRS Activist Gelu Srinivas Arrest: హైదరాబాద్‌లోని మహాన్యూస్ ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కీలక చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ యువనేత గెల్లు శ్రీనివాస్‌ను శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఈ ఘటనలో పాల్గొన్న ఇతర నిందితులను కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రభుత్వం స్పందన
మీడియా సంస్థపై జరిగిన ఈ దాడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఘటనపై విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇది రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛపై దాడిగా అభిప్రాయపడుతూ, చర్యల్లో తేడా లేకుండా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
మేజిస్ట్రేట్ ఎదుటకు నిందితులు
అరెస్ట్ అయిన గెల్లు శ్రీనివాస్‌తో పాటు మరికొంతమందిని కాసేపట్లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు సమాచారం. వారి పై ఎలాంటి సెక్షన్లను నమోదు చేస్తారన్నది అధికారిక ప్రకటనతో తెలియవలసి ఉంది.