Adluri lakshman : మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మెట్‌పల్లి మండలంలోని అరపేట్ గ్రామ శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారుకు ముందు చక్రాలు ఊడిపోవడంతో అపాయం ఏర్పడింది.
పర్యటన ముగించుకుని మెట్‌పల్లి నుంచి ధర్మపురి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సడెన్‌గా కారుకు లోపం రావడంతో వెంటనే వాహనం ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏవిధమైన గాయాలు సంభవించకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
ప్రమాదం అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మరో వాహనంలో ప్రయాణం కొనసాగించారు. ఘటన జరిగిన స్థలాన్ని కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నరసింహారావుతో పాటు కోరుట్ల డీఎస్పీ పరిశీలించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.