Delhi Crime:ఇప్పటి తరం కొంత మంది యువతలో ఆవేశాలు మితిమీరుతున్నాయి. ఓపిక అనేది నశించిపోతున్నది. క్షణికావేశాలకు లోనవుతూ ఏం చేస్తున్నామో తెలుసుకోలేకపోతున్నారు. విచక్షణ కోల్పోతూ రాక్షసులుగా మారుతున్నారు. బయటివారిపైనే కాదు.. సొంత కుటుంబంపైనా దాడులు చేస్తూ ఏకంగా ప్రాణాలనే హరించే స్థాయికి ఆ కోపాలు వెళ్తున్నాయి. ఇలాగే విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు చిన్న కారణానికి తన తండ్రిని గన్‌తో కాల్చి చంపేశాడు.
Delhi Crime:ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ ఎస్ఐగా పనిచేసిన సురేంద్రసింగ్ (60) రెండేండ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. అక్కడి నివాసం ఉంటున్నారు. వారికి కొడుకు దీపక్ (26), భార్య ఉన్నారు. ఆ కుటుంబం ఉత్తరాఖండ్‌లో ఉన్న తమ సొంతూరికి వెళ్లేందుకు సిద్ధమైంది. నిన్న రాత్రి 7.30 గంటల సమయంలో వెళ్లేందుకు సిద్ధమై, ఒక టెంపోను అద్దెకు తెచ్చుకున్నారు. వస్తు సామగ్రిని ఆ వాహనంలో సర్దుకున్నారు.
Delhi Crime:ఇక బయలుదేరే ముందు అందరూ వాహనంలోకి ఎక్కారు. ముందు సీటులో కూర్చునేందుకు సురేంద్రసింగ్ సిద్ధంకాగా, తానే ఆ సీటులో కూర్చుంటానంటూ దీపక్ తండ్రిని వారించాడు. కాదు తానే కూర్చుంటానని ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త ముదిరింది. ఎవరూ సర్దుకోలేకపోయారు. ఇద్దరూ ముందు సీటు కోసమే పోటీపడ్డారు.
Delhi Crime:ఈలోగా దీపక్‌లో ఓపిక నశించింది. ఆవేశం కట్టలు తెంచ్చుకున్నది. సహనం కోల్పోయాడు. కోపోద్రిక్తుడై కన్నతండ్రి అనే విచక్షణను మరిచాడు. వెంటనే తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌తో ఏకంగా తండ్రికి గురిపెట్టి ఒక్క పెట్టున కాల్చి చంపేశాడు. వెంటనే కాల్పుల శబ్దం విన్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోగా, దీపక్ చేతిలో ఉన్న గన్‌ను చూసి అతడిని అరెస్టు చేశారు. సురేంద్రసింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. ఇది ఆందోళన కలిగించే అంశమని, బాల్యంలో సరైన బోధనాలోపమే దీనికి ప్రధాన కారణమని మానసిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
