KCR:

KCR: జ‌ర్న‌లిస్టు స్వేచ్ఛ మృతిపై స్పందించిన కేసీఆర్‌

KCR: సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్టు, ర‌చ‌యిత స్వేచ్ఛ మ‌ర‌ణంపై మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఆమె మృతికి ఒక ప్ర‌క‌ట‌న‌లో సంతాపం తెలిపారు. స్వేచ్ఛ ఆక‌స్మిక మ‌ర‌ణంపై తీవ్ర విచారం వ్య‌క్తంచేశారు. స్వేచ్ఛ మ‌ర‌ణం తెలంగాణ స‌మాజానికి విషాద‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.

KCR: సామాజిక స్పృహ ఉన్న క‌వ‌యిత్రిగా, జ‌ర్న‌లిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ అకాల మ‌ర‌ణం చెంద‌డంపై బాధాక‌ర‌మ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. స్వేచ్ఛ త‌ల్లిదండ్రులైన స‌హ‌చ‌ర శంక‌ర్‌, శ్రీదేవి నాటి తెలంగాణ ఉద్య‌మంలో చురుకుగా పాల్గొన్నార‌ని, బిడ్డ‌ను కోల్పోయి శోక‌త‌ప్త హృద‌యులైన వారికి త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలిపారు.

KCR: ఇదిలా ఉండ‌గా స్వేచ్ఛకు ఇదివ‌ర‌కే వివాహ‌మై సుమారు 13 ఏళ్ల కూతురు ఉండగా, కొన్ని కార‌ణాల‌తో మొద‌టి భ‌ర్త‌తో ఆమె విడాకులు తీసుకున్న‌ది. అయితే టీ న్యూస్ మాజీ ఉద్యోగి పూర్ణ‌చంద‌ర్ అనే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తున్న స్వేచ్ఛ.. గ‌త‌కొంత‌కాలంగా పూర్ణ‌చంద‌ర్‌తో విభేదాలు ఉన్న‌ట్టు స్నేహితుల ద్వారా తెలిసింది. ఈ మేర‌కు స్వేచ్ఛ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *