Iran vs US: ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఇటీవలి బాంబు దాడి తరువాత, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంలో విజయం సాధించామని ఖమేనీ ప్రకటించగా, దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఖమేనీని “వికారమైన మరణం” నుంచి తాను రక్షించానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా దళాలు ఖమేనీపై దాడికి సిద్ధంగా ఉన్నాయని, కానీ చివరి నిమిషంలో తానే ఆపినట్లు చెప్పడం గమనార్హం.
ఇది కేవలం మాటల పరిమితంగా కాదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. “ఒప్పందం కావాలంటే, ట్రంప్ తన అపహాస్యభరితమైన వ్యాఖ్యలను ఆపాలి” అని హెచ్చరించారు. ట్రంప్ మాటలు మతపరంగా బాధించేవి అని, ఒక గొప్ప మతనాయకుడిపై అబద్ధాలు చెప్పడం తగదన్నారు.
ఇది కూడా చదవండి: Engineering Counselling: నేటి నుంచి ఎప్‌సెట్ కౌన్సెలింగ్..
ఇరాన్ ఇప్పటికే అమెరికాపై సైనికంగా దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇరాన్ మూడు అణు కేంద్రాలను నాశనం చేశామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి.
ఈ సారి ఇజ్రాయెల్ కూడా బలంగా స్పందించినట్లు, చివరి దశలో భారీ దాడికి సిద్ధమైన విమానాలను వెనక్కు తీసుకొచ్చామని ట్రంప్ వెల్లడించారు. ఇది జరిగి ఉంటే వేలాది ఇరానియన్లు ప్రాణాలు కోల్పోయేవారని ఆయన చెప్పారు.
