Prashant Kishor: ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి గతంలో బీహారీయులపై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ఆనాటి వ్యాఖ్యలకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీయే బాధ్యత వహించాలని ప్రశాంత్ కిషోర్ డిమాండ్ చేశారు. బీహార్ ప్రజలపై మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై ముందు రాహుల్‌గాంధీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Prashant Kishor: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్.. బీహార్ సలహాదారులు, అధికారులను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించారని, కూలిపనులు చేయడం బీహార్ ప్రజల డీఎన్ఏలోనే ఉన్నదని ఆనాడే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ కిశోర్ గుర్తు చేశారు. త్వరలో జరిగే బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Prashant Kishor: రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల దరిమిలా రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకొని బీహార్‌లోకి అడుగు పెడతారని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. బీహార్ ప్రజలను కించపర్చేలా మాట్లాడిన రేవంత్‌రెడ్డిపై ముందు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాతే రాహుల్‌గాంధీ బీహార్‌లో అడుగు పెట్టాలని, ఎన్నికల ప్రచారానికి రావాలని సవాల్ విసిరారు.