Karthi 29: నేచురల్ స్టార్” నాని, కోలీవుడ్ స్టార్ కార్తీ కాంబినేషన్‌లో సినీ ప్రియులకు ఓ అదిరిపోయే సర్ ప్రైజ్ సిద్ధమవుతోంది. కార్తీ 29వ చిత్రంలో నాని కీలకమైన క్యామియో రోల్‌లో కనిపించనున్నారని తాజా సమాచారం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళ్ దర్శకుడు తమిళ్ రూపొందిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ 2025లో విడుదల కానుంది. ఈ సినిమాలో కార్తీ యాక్షన్-ప్యాక్డ్ రోల్‌లో ఆకట్టుకోనుండగా, నాని పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలవనుందని టాక్.
Also Read: Ajith Kumar: అజిత్ కొత్త లుక్ షాక్.. ఫ్యాన్స్‌లో కలకలం!
Karthi 29: ఇప్పటికే ‘హిట్ 3’తో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన నాని, ఈ చిత్రంతో మరోసారి తన నటనా ప్రతిభను చాటనున్నారు. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కార్తీ, నాని ఫ్యాన్స్‌కు ఈ సినిమా విజువల్ ట్రీట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.