Akhanda 2

Akhanda 2: అఖండ 2కి రికార్డ్ బిజినెస్.. బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్?

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం వివిధ మార్కెట్లలో భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు రూ.120 కోట్ల మైలురాయిని అధిగమించనున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బాలయ్య కెరీర్‌లో ఇంత భారీ బిజినెస్ ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ టీజర్ ఫ్యాన్స్‌లో హైప్‌ను రెట్టింపు చేసింది. బాలయ్య శివతాండవ రూపంలో త్రిశూలంతో చేసిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఈ టీజర్ బాలయ్య మాస్ ఇమేజ్‌ను మరోసారి గుండెల్లో నాటేలా చేసింది. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *