HIT 3: నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్-3 సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. అయితే, ఈ చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది. మహిళ రచయిత విమల్ సోని తన కథను కాపీ చేశారంటూ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను రాసిన ‘ఏజెంట్ 11’ మరియు ‘ఏజెంట్ V’ కథల నుంచి హిట్-3 స్క్రిప్ట్‌ను తీసుకున్నారని ఆమె ఆరోపించారు. నాని గాఢ అభిమానినిగా చెప్పుకున్న విమల్, తన ఒరిజినల్ కథను కోర్టుకు సమర్పించి, చిత్ర బృందంపై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు.
గతంలోనూ శైలేష్ కొలను ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వెంకటేష్ నటించిన ‘సైంథవ్’ సినిమా కథను కాపీ చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిట్-3పై వచ్చిన తాజా ఆరోపణలు చిత్ర బృందాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. కోర్టు ఈ కేసుపై ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.