Kajol

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీలో భయానక అనుభవం: కాజోల్ షాకింగ్ కామెంట్స్..!

Kajol: ప్రముఖ రామోజీ ఫిల్మ్ సిటీ (RFC) గురించి సినీ నటి కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లో ఉన్న ఈ ప్రసిద్ధ ఫిల్మ్ సిటీకి తాను మళ్లీ జన్మలో వెళ్ళనని ఆమె తీవ్రంగా పేర్కొన్నారు.

భయానక అనుభవాలు ఎదురయ్యాయంటూ.. కాజోల్ తన అనుభవాలను పంచుకుంటూ, రామోజీ ఫిల్మ్ సిటీలో తనకు కొన్ని భయానక అనుభవాలు ఎదురయ్యాయని వెల్లడించారు. “నాకేం స్పష్టంగా కనిపించలేదు, కానీ ఏదో తెలియని భయం నన్ను వెంటాడింది. దేవుడి దయ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను” అని ఆమె అన్నారు.

ప్రపంచంలోనే ‘మోస్ట్ హాంటెడ్’ ప్రదేశం!
ప్రపంచంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత దెయ్యాలున్న (మోస్ట్ హాంటెడ్) ప్రదేశమని కాజోల్ వ్యాఖ్యానించారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read: Sundeep Kishan: హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం..

Kajol: రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్‌లో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇక్కడ అనేక సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్‌లు జరుగుతాయి. అయితే, కాజోల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ సిటీపై కొత్త చర్చకు దారి తీశాయి. గతంలో కూడా ఫిల్మ్ సిటీలో కొన్ని వింత సంఘటనలు జరిగినట్లు పుకార్లు వచ్చాయి, అయితే అవి అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించబడలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Goat vs Lamb Meat: మేక - గొర్రె మాంసం మధ్య తేడా ఏమిటి..? ఆరోగ్యానికి ఏది మంచిది..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *