Kajal Aggarwal: సినీ పరిశ్రమలో కాజల్ అగర్వాల్ గురించి హాట్ టాక్ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, కాజల్ త్వరలో బోల్డ్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. తమన్నా, టబు, ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్లు ధైర్యమైన పాత్రలతో అలరించిన నేపథ్యంలో, కాజల్ కూడా ఇదే బాటలో అడుగుపెట్టనున్నారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, ఈ విషయంపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.
Also Read: Ye Maaya Chesave: ఏ మాయ చేసావె’ రీ-రిలీజ్‌పై సమంత స్పష్టత!
Kajal Aggarwal: ఇంకో సంచలన వార్త ఏంటంటే, కాజల్ త్వరలో దర్శకురాలిగా మారబోతున్నారట. తాను దర్శకత్వం వహించే చిత్రంలో ఆమెనే ప్రధాన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కాజల్ ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. అలాగే, ‘ది ఇండియా స్టోరీ’, ‘ఇండియన్ 3’, బాలీవుడ్‌లో ‘రామాయణ: పార్ట్ 1’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కాజల్ కొత్త రూట్‌లో అభిమానుల్ని ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు!
