Coolie: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రం భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో, ఉపేంద్రతో పాటు పలువురు ప్రతిభావంతులు నటిస్తున్నారు. తమిళం, తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి తొలి సాంగ్ రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఈ పాట ఈ వారంలోనే విడుదల కానుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే వీకెండ్‌లో అధికారిక ప్రకటనతో పాటు సాంగ్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఆగస్ట్ 14న గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!
