Suryakumar Yadav: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో పోరుకు సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభమవుతుంది. శుభ్‌మాన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా.. ఈ సిరీస్ యంగ్ ఇండియాకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సూర్యకుమార్ ప్రస్తుతం తన కుడి హెర్నియాకు చికిత్స కోసం లండన్‌లో ఉన్నాడు. దీంతో కొన్ని రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు.
సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది?
శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని భారత టెస్ట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. వన్డేలు, టీ20లకు ఇప్పట్లో లేవు. కాబట్టి సూర్య దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. సూర్యకుమార్ చికిత్స వచ్చే వారం ప్రారంభమవుతుంది. ఆగస్టు నాటికి తిరిగి మైదానంలో అడుగుపెడతారని అంతా భావిస్తున్నారు. బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ.. వైద్య ప్రక్రియకు రెండు నెలలు పట్టే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: WTC Final 2025: WTC ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓడిపోవడానికి IPL కారణమా..?
ఆగస్టు వరకు భారత్‌కు ఎటువంటి T20 కమిట్‌మెంట్‌లు లేనందున సూర్యకుమార్ యాదవ్‌కు ఈ సమయం ఉత్తమమైనది. ఆ తర్వాత వన్డేల కోసం బంగ్లాదేశ్‌కు వెళతారు. దీని తర్వాత దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో స్వదేశంలో సిరీస్‌లు, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన వంటివన్నీ టీమిండియా యొక్క 2026 T20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగం. అందువల్ల సూర్యకుమార్ ఈ గ్యాప్ లో చికిత్స చేయించుకోవాలనే నిర్ణయం వ్యూహాత్మకమైనది. ఎందుకంటే ఇది రాబోయే కీలకమైన T20 సీజన్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉండటానికి అతనికి మంచి అవకాశం.
IPL 2025 సీజన్‌లో సూర్య అద్భుతంగా రాణించాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్యకుమార్ 16 మ్యాచ్‌ల్లో 65.18 సగటు, 167.9 స్ట్రైక్ రేట్‌తో 717 పరుగులు చేశాడు. ముఖ్యం అతను మొత్తం 16 ఇన్నింగ్స్‌లలో 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.


