Gold rate: బంగారానికి భారీ డిమాండ్ పెరగడంతో ఆ డిమాండ్ కు తగ్గట్టు రేటు కూడా పెరుగుతుంది. సీజన్ కానప్పుడే బంగారం ధర పైపైకి వెళ్ళింది. అలాంటిది ఇంకా పెళ్లిళ్ల సీజన్ వస్తుంటే రేటు ఆకాశం అంటుంది. సగటున ఒక్క రోజుకు ఇంత పెరుగుతూ ధర ఆకాశాన్ని అంటుంది.
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాదు లో మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.81,120గా ఉంది. ఆదివారం కిలో వెండి ధర రూ.99,750 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,036 తగ్గి రూ.98,714కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర ఇలా ఉంది.24k 80,940గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో తులం బంగారం ధర ఇలా ఉంది. 24k 80, 940గా ఉంది.
వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా లో పరిశీలిస్తే..24k 81, 150గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 24k 81, 110గా ఉంది.
ప్రస్తుతం బంగారం ధర 81 వేల రూపాయల దగ్గర ఉంది. అయితే ఈ రేంజ్ నుంచి బంగారం ధర మరింత ముందుకు వెళుతుందా లేక పతనం అవుతుందా అనే సంగతి ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తే ధర పెరుగుతుందే కానీ తగ్గు మోకం పట్టడం లేదు.
భారత్‌లో బంగారం డిమాండ్:
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సమాచారం ప్రకారం భారతదేశంలో గత సంవత్సంర బంగారం డిమాండ్ తగ్గుముఖం పట్టింది. అయితే, ఒకానోక సందర్భంలో బంగారం వినియోగం పరంగా చైనాని కూడా భారత్ అధిగమించింది. నిజానికి, భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. ఇ-గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్లు వంటి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నా, పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని ప్రస్తుతం ఉన్న భౌతిక రూపంలోనే కొనేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఖాతా లోటు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా బంగారం దిగుమతులను తగ్గిచేందుకు ప్రయత్నించింది. గత ఏడాది బంగారం దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు సుంకం పెంపును అమల్లోకి తీసుకొచ్చింది.