Anathapuram: అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణమైన హత్య జరిగింది. సొంత అన్న, పెద్ద కంబగిరి తన తమ్ముడు చిన్న కంబగిరిని వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ దాడిలో చిన్న కంబగిరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు ప్రధానంగా ఆస్తి తగాదాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అన్నదమ్ములైన పెద్ద కంబగిరి రాముడు, చిన్న కంబగిరి మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
తాజా సమాచారం ప్రకారం, చనిపోయిన చిన్న కంబగిరి గతంలో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్ళి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత, అతను మళ్లీ తన అన్న పెద్ద కంబగిరి రాముడితో ఆస్తి విషయంలో ఘర్షణలు మొదలుపెట్టాడు. చిన్న కంబగిరి తనను కూడా హత్య చేస్తాడేమోనన్న భయంతోనే పెద్ద కంబగిరి రాముడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు డేట్ ఫిక్స్..
Anathapuram: పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పెద్ద కంబగిరి రాముడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఆస్తి వివాదాలు సొంత బంధాల మధ్య ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

